Actor Jagapathi Babu Clarifies On Sarileru Neekevvaru Movie Issue. he released a video regarding that issue.
#maheshbabu
#sarileruneekevvaru
#anilravipudi
#jagapatibabu
#maharshi

గత 33 ఏళ్లుగా ఇండస్ట్రీలో తనకు ఈ పరిస్థితి రాలేదని.. తొలిసారి స్పందించాల్సి వచ్చిందంటూ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు సీనియర్ హీరో జగపతి బాబు. ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించి విలన్‌గా లైఫ్ టర్న్ చేసుకున్న జగపతిబాబు.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రతినాయకుడిగా హీరో స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీగా మారారు జగపతిబాబు. తాజాగా ఆయన తెలుగులో మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం నుండి కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకున్నారు. అయితే ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో మీడియాలో భిన్న కథనాలు ప్రసారం అయ్యాయి. వీటిపై స్పందిస్తూ ట్విట్టర్‌లో వీడియో విడుదల చేశారు జగపతి బాబు.